wood calculator

wood calculator formula

 

కలప జంత్రి 

ఇంటికి కావలసిన మెటీరియల్ ముందుగా కలప గురించి తెలుసుకుందాం సాధారణంగా మనకి కలప గురించి తెలియదు తెలిసిన మనం మోసపోతూనే ఉంటాం దానికి కారణం మనకు పూర్తిగా తెలియకపోవడమే అసలు కలప కొనేముందు మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయాలు . 

కలపని లెక్కించడం నేర్చుకోవాలి  కలపని అడుగులలో లెక్కిస్తారు ఇ లెక్కని కలపజంత్రి  అంటారు కలప అమ్మేవారు ఎవరైనా  ఈ లెక్క ఆధారంగానే అమ్ముతారు 


ఇప్పుడు మనం కలప సైజు లో కొనేముందు వాటిని అడుగులలో లెక్కించడం తెలుసుకోవాలి 

ఒక గుమ్మానికి కమ్మి సైజు  4 * 3  పొడవు  6 * 6  ఐతే ఆరున్నర అంగుళాలు అవుతుంది 

నాలుగు  ఇంటూ మూడు సైజు కమ్మి ఎన్ని  అడుగులు ఐతే అన్ని అంగుళాలు అవుతుంది 


మనం calculator లో ఎలా లెక్కించాలో తెలుసుకోవాలి . 
 
ఫస్ట్ కమ్మి యొక్క సైజు టైప్ చేసి * ప్రెస్ చేసి ఆ తర్వాత పొడవు టైప్ చేయాలి  ఆ తర్వాత  % 144 =జవాబు 
 
 
 ఉదాహరణకి –  4 * 3    6 * 6  %  144 = 0 .5416666666 * 12 = 6 .49999999992 
 
 
ఇక్కడ డాట్తర్వాత వచ్చిన  రెండు అంకిలను  మాత్రమే  పరిగణలోకి తీసుకోవాలి  అంటే ఇక్కడ 
6 .49 ఆరు అంగుళాల 49 పాయింట్లు  49 అంటే అరంగుళం   అరంగుళం అంటే 50 పాయింట్లు 
కచ్చితమైన కొలత రావాలంటే  డాట్ తర్వాత వచ్చిన అన్ని నంబర్లతో కలిపితే సరిపోతుంది . 


పన్నెండు అంగుళాలు అంటే ఒక అడుగు 1     
 
రెండు ఆరంగుళాలు ఒక అంగుళం          1/2
 
నాలుగు పాతికలు ఒక అంగుళం               1/4
 
ఎనిమిది నూలు ఒక అంగుళం                  1/8
 
 
 
ఒక అడుగు అంటే 100 % అని అర్ధం 
 
100% శాతం  ఒక అడుగు 
 
50% శాతం  ఆరు అంగుళాలు 
 
25% శాతం మూడు అంగుళాలు 
 
8. 34 శాతం ఒక అంగుళం 
 
16. 67 శాతం రెండు అంగుళాలు 
 
కమ్మి సైజు calculator లో టైప్ చేసేటప్పుడు  
 
సైజు  వ్రాసేటప్పుడు ఐతే        4. 0               4.1/2               4.1/4               4.1/8    ఇలా 
 
 
calculator 
లో టైప్ చేసేటప్పుడు             4. 0                   4. 5                  4. 25              4. 125    ఇలా 
    
       పర్సెంటేజ్ లో టైప్ చేయాలి 
 
 
పొడవు మాత్రం అడుగులలోనే టైప్ చేయాలి  అంటే  అడుగు . అంగుళాలు   
 
నాలుగున్నర ఐతే  4. 5  కాకుండా  4. 6 అని టైప్ చేయాలి   ఎందుకంటే  అడుగులో సగం  ఆరు అంగుళాలు గనుక 
 
 
మీ మొబైల్ లో చాలా సింపులుగా  కలప అడుగులు లెక్కించడానికి ఒక అప్ అందుబాటులో ఉంది  దానికి సంబందించిన అప్ లింక్ కింద ఇవ్వడం జరిగింది 



 
 
 

Main Menu


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (0) in /home/choiceour/public_html/wp-includes/functions.php on line 4552